You are at Cherryfans.com  > Gabbarsingh to break all time collection record -says Harish sankar
 

                       

రికార్డులకు'గబ్బర్ సింగ్' షేరెంత?

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ రిలీజైన నాటినుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దాంతో ఈ చిత్రం రికార్డులు బ్రద్దలు కొడుతుందా..కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా అనే స్పెక్యులేషన్స్ మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కొత్త రికార్డులు క్రియేట్ చేయాలంటే 72 కోట్లుకు పైగా షేర్ సాధించాలని ట్రేడ్ లో వినపడుతోంది. ఇదే ఊపు మరో రెండు వారాలు పాటు కొనసాగితే ఆ రేంజికి రావటం కష్టమేమి కాదంటున్నారు. కొనుక్కున్నవారంతా ఈ చిత్రం తెప్పిస్తున్న కలెక్షన్స్ కు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఇక గబ్బర్ సింగ్ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ అదే జోష్ తో చేసి అదరకొట్టాడు. దబాంగ్ సినిమా నచ్చి తనే స్వయంగా నిర్మిద్దామని కొనుక్కున్నాడు. అలాగే ఎప్పుడో హరీష్ శంకర్ కి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అవకాశం ఇచ్చాడు. పవన్ నమ్మకాన్ని హరీష్ నిలబెడుతూనే..మొదటి ప్రోమో విడుదలైన వెంటనే విపరీతమైన అంచనాలు పెరిగాయి. నాక్కొచెం తిక్కుంది..దానికో లెక్కుంది అన్న ప్రోమోకి విపరీతమైన అప్లాజ్ వచ్చింది. అందుకు తగ్గట్లుగా పెరిగిన అంచనాలును నిజం చేస్తూ విడుదలైన రోజే సంచలన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని అందరిలో కలిగించింది.

దర్శకుడు హరీష్ శంకర్ ...ఈ సినిమా సక్సెస్ వెనక సీక్రెట్ వివరిస్తూ... సినిమా అనేది ప్రేక్షకులందరికీ నచ్చాలి. అభిమానులకు ఇంకొంచెం ఎక్కువ నచ్చాలి. ఈ సూత్రాన్ని దృష్టిలో ఉంచుకొని పని చేశాను.''అన్నారు హరీష్‌ శంకర్‌. ఇక ''హిట్టు..ప్లాప్ లను నమ్ముకొని నేను పరిశ్రమకు రాలేదు. కేవలం పనిని నమ్ముకొని వచ్చాను. వరుసగా రెండు విజయాలు అందుకోవడమంటే... ఒక దర్శకుడిగా నాపై మరింత బాధ్యత పెరిగినట్లే అని ఖచ్చితంగా చెప్పారు.

దబాంగ్ లో మార్పులు చేయటంపై స్పందిస్తూ...హిట్టన సినిమా అయినా తెలుగులు చేసేటప్పుడు మార్పలు అవసరమే. మన ప్రేక్షకుల అభిరుచి, మన హీరోల ఇమేజ్‌కి తగ్గ విధంగా మంచి మార్పులు చేసుకోవాలి. 'దబాంగ్‌'లో హీరో లంచం తీసుకోవడం ఉంటుంది. కానీ నా వరకూ అది నచ్చలేదు. మార్చాను. 'దబాంగ్‌' కథ బాలీవుడ్‌కి కొత్తే. దానికి భిన్నంగా సినిమా తియ్యాలని కొన్ని మార్పులు చేశాను. ఇదొక రీమేక్‌ చిత్రం కాబట్టి... మన నేపథ్యానికి అనుగుణంగా చాలా మార్పులే చేసుకొన్నాం. 'దబాంగ్‌'లోని ప్రతి సన్నివేశాన్నీ విశ్లేషిస్తూ ఈ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాం. అందుకే కొంచెం ప్రాసతో మాటలు, మార్పులు అని రాశాను. వినోదంలో భాగంగానే ఆ ఆలోచన వచ్చింది. మేం ఊహించినట్టుగానే థియేటర్లో నవ్వుకోవడం అక్కడ్నుంచే మొదలైంది అంటూ హరీష్ శంకర్ వివరించారు.

Gabbarsingh to break all time collection record -says Harish sankar

Advertise | About this site | Site Map | Privacy Policy | Disclaimer