మెగా స్టార్
చిరంజీవి గురించి కొంత మంది అనేక
రకాలుగా చెప్పుకుంటారు. ఇటీవల
కాలంలో.. చిరంజీవి పై విమర్శలు
చేయటానికి కొంత మంది అతి ఉత్సహాం
చూపిస్తున్నారు. చిరంజీవి గారు
నిన్న చేసిన ఒక చిన్న సంఘటనే
ఇందుకు నిదర్శనం.
మెగా స్టార్ చిరంజీవిగారు ..
నిన్న హైదరాబాద్ లోని రాజీవ్ నగర్
కాలనీ వెళ్లటం జరిగింది. ఆయన
వెళ్లింది పార్టీ పని కాదు సుమా..,
అసలు రాజీవ్ నగర్ కాలనీకి
వెళ్లాటాని కారణం ఉంది. చిరంజీవి
అభిమాని, పిఆర్పీ కార్యకర్త అయిన
దాసరి సురేష్ ఇంటికి వెళ్లటం
జరిగింది. సురేష్ చిరంజీవి అంటే
చాలా ఇష్టం . ఆ ఇష్టంతోనే
పిఆర్పీలో మంచి కార్యకర్తగా చిరు
వద్ద మంచి పేరు తెచ్చుకున్నాడు.
పార్టీలో చేరిన సురేష్ కు ఆర్థికం
ఇబ్బందులతో సతమతమైవాడు. ఆ విషయం
తెలుసుకున్న చిరు.. అనేక సార్లు
తన అభిమాని సురేష్ ఆర్థిక
ఇబ్బందులను తీర్చాటం జరిగింది.
చిరంజీవి గారు చూపించే అభిమానానికి
ముగ్థుడైన సురేష్ పార్టీ
కార్యక్రమాలలో చురుగ్గా ఉండేవాడు.
అయితే ఇటీవల
సురేష్ కుటుంబానికి ఆర్థిక
ఇబ్బందులు ఎక్కువకావటంతో.. ఇంట్లో
భార్య భర్తల మధ్య గొడవలు మొదలైనాయి.
ఆ గొడవలు ..నిన్న తారస్థాయికి
చేరటంతో.. సురేష్ భార్య ఆత్మహత్య
చేసుకుంది. ఆమె అలా చేసుకోవటానికి
చిన్న కారణమే. ఇంట్లో టీవీ భార్య
భర్తలు , పిల్లలు ..చూస్తున్నారు.
ఇక్కడే .. భార్య భర్తలకు మాటలు
పెరిగాయి. ఇరువురు కోపంగా
అరుసుకున్నారని స్థానికులు
చెబుతున్నారు. ఆ క్షణికావేశంలో..
సురేష్ భార్య ఆవేశంగా .. గదిలోకి
వెళ్లి తలుపు వేసుకుందట. అక్కడే
ఉన్న సురేష్ ఆమె సహజంగా తలుపు
వేసుకుందిలే అని సైలెంట్ గా
ఉన్నాడు. సమయం మించిపోతున్నప్పటికి
ఆమె తలుపు తీయ్యకపోవటంతో.. సురేష్
అనుమానంతో.. తలుపు నెట్టగా ..అప్పటికే
జరగవలసినది జరిగిపోయింది. వెంటనే
సురేష్ స్థానికుల సాయంతో తలుపు
పగలగొట్టి చూడగా.. ఆమె ఉరికి
వెలాడుతూ కనిపించటంతో.. సురేష్
ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయాడు.
ఈ విషయం
తెలుసుకున్న మెగా చిరంజీవి
గారు..తన అభిమాని భార్య సూసైడ్
చేసుకుందని.. వెంటనే రాజీవ్ నగర్
కాలనీ లో ఉంటున్న దాసరి సురేష్
ఇంటికి రావటం జరిగింది. ఒక ప్రముఖ
వ్యక్తి , ఒక మెగా స్టార్, ఒక
రాజకీయ నాయకుడు, తన అభిమాని భార్య
చనిపోతే ..రావటం చరిత్రలో ఇదే
మొదటి సారి. రాజీవ్ నగర్ కాలనీ
లోకి చిరంజీవి వచ్చాడు అనే వార్త
తెలియటంతో.. అక్కడ జనం సంఖ్య
విపరీతంగా పెరిగిపోయింది.
చిరంజీవి
ఒక్కసారి తన అభిమాని చూసి..
కన్నీళ్లు పెట్టుకోవటంతో..
అక్కడున్నా వారు కూడా కన్నీళ్లు
పెట్టుకోవటం జరిగింది. ఆ
ప్రాంతంమంత .. ఒక్కసారి మౌనం
అవహించింది. తన అభిమాని సురేష్ ని
ఓదార్చుతూ.. ఇలా ఎందుకు జరిగింది
అని సురేష్ అడగటంతో.... కేవలం
ఆర్థిక ఇబ్బందుల వలన అని సురేష్
చెప్పటంతో. చిరంజీవి తన కన్నీళ్లను
ఆపులేకపోయాడు. ‘‘.నీకు నేను
ఉన్నాను కదా.. నీవు వచ్చి నన్ను
అడగొచ్చు కదా’’ అని చిరు
చెప్పాటంతో.. సురేష్ ఒక్కసారి గా
చిరంజీవిని పట్టుకొని .. ఏడుస్తూ..
మీరు ఇప్పటికే ఎన్నో సార్లు నా
కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నారు.
ఇంకా మిమ్మల్ని ఎలా అడుగుతాను..
అని తన బాధను చిరుకు వినిపించాడు.
చిరంజీవి కన్నీళ్ళతో.. సురేష్
పిల్లలను దగ్గరకు తీసుకొని.. ఇక
నుండి ఈ పిల్లలు బాధ్యత నేను
తీసుకుంటానని సురేష్కు హామీ ఇవ్వటం
జరిగింది. తదుపురి కార్యక్రమాలో..
చిరంజీవి గారు.. తన అభిమాని భార్య
శవపేటికను.. మోయటం జరిగింది. అది
చూసిన జనం ఒక్కసారి షాక్ తిన్నారు.
ఒక అభిమాని భార్య శవపేటికను ఒక
ఉన్నతమైన వ్యక్తి మోయటం చూసి అందరు
ఆశ్చర్యానికి లోనైనారు.
చిరంజీవి గారు మనస్సు ఇంత
ఉన్నతమైనదా? ఇంత దయగల మనిషి
చిరంజీవిగారు, తన అభిమాని భార్యను
చూడటమే కాకుండా .. శవపేటికను కూడా
మోయటం దునియాలో ఇదే మొదటిసారి అని
రాజీవ్ నగర్ కాలనీ ప్రజలు
అనుకుంటున్నారు. ఒక్క అభిమాని మీదే
ఇంత ప్రేమ కురిపిస్తుంటే.. ఇక
రాష్ట్ర ప్రజలంటే.. ఆయనకు ఎంత
ఇష్టమో ఇట్టే తెలిసిపోతుందని
ప్రజలు అంటున్నారు. ఇలాంటి
వ్యక్తిని మన నాయకుడిగా ఎందుకు
ఎన్నుకోలేకపోయాము అని రాజీవ్ కాలనీ
ప్రజలు చాలా బాధపడుతున్నారు. తన
అభిమానులకు అండగా ఉండే వారిలో
మొదటి వ్యక్తి చిరంజీవిదేనని
రాజీవ్ నగర్ కాలనీ ప్రజలు
అంటున్నారు.
గొప్పహోదాలో ఉన్నప్పటికి తన
అభిమానులనే కాకుండా .. వారి
కుటుంబ సభ్యులను కూడా చిరు
అభిమానిచటం ఎంతో గోప్ప విషయమనే
చెప్పాలి. ఎందుకంటే.. ఈరోజుల్లో
.. సొంత తమ్ముడునే వదులుకుంటున్నా
రోజులు. అలాంటి ఒక అభిమాని భార్య
కోసం చిరంజీవిగారు ఇలా చేశారు అంటే
రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వంగా
ఉందని చెప్పుకోవాలి. తెర మీదే మెగా
స్టార్ కాదు .. నిజీ జీవితంలో కూడా
మెగా స్టార్ చిరంజీవి అని
నిరూపించుకున్నాడు. |