CHERRY

Cherry

Galleries

Downloads

Others

        

CHIRU

Chiru

Biography

Filmography

Galleries

CCT

Downloads

Others 

                          

PAWAN

Pawan

Biography

Filmography

Galleries

Interviews

Downloads

Others

                             

BUNNY

Bunny

Biography

Galleries

Downloads

Filmography

                         

UPDATES

 

 Home| Galleries| PRP Galleries| PRP News| Video| Audio | Fan-zone | Records | Articles | News |Photo

Home   >   Updates  > News   > Chiranjeevi intensified attack on Jaganmohanreddy

అధికార దాహమే జగన్ సిద్ధాంతం
త్వరలోనే నీ పాపం పండుతుంది
అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకోవడమే నీ పార్టీ అజెండా
                                                                 జగన్‌పై నిప్పులు చెరిగిన చిరంజీవి

తిరుపతి, మే 11 : "నువ్వు పార్టీని పడగొడతానని తొడగొట్టావు. నేను నిలబెడతానని మాటిచ్చి నిలబెట్టాను. పార్టీ పెట్టడం హీరోయిజం అనుకున్నావేమో! ఈ రోజు నువ్వు హీరోయిజం అనుకున్నది రేపు విలనిజంగా మారబోతోంది. నీ పాపాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. తొందర్లో నీ పాపం పండుతుంది. ప్రజలు నీకు తగిన బుద్ధిచెప్పే రోజు వస్తుంది'' అంటూ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి జగన్‌ను హెచ్చరించారు. శుక్రవారం తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జగన్‌పై మాటలతో విరుచుకుపడ్డారు.

ఒక పార్టీ స్థాపిస్తే దానికి ఒక సిద్ధాంతం ఉండాలి. ఒక లక్ష్యం ఉండాలి. జగన్ పార్టీకి అధికార దాహం తప్ప మరో సిద్ధాంతం, లక్ష్యం కానీ లేవన్నారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఓటు వేస్తే శ్రీవేంకటేశ్వరస్వామికి ద్రోహం చేసినట్టు అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ విషవృక్షమైతే జగన్ పార్టీ దాని కొమ్మ అని చెబుతున్న చంద్రబాబు తాను ఎక్కడి నుంచి వచ్చారో ఆలోచించాలన్నారు. ఆ రోజు యువకుడివైన నిన్ను దగ్గరకు తీసుకుని రాజకీయ భిక్షపెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు నీతి, నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని చిరంజీవి విమర్శించారు.

"ఈ రోజు ఈ ప్రభుత్వం ఇంత అస్తవ్యస్థంగా తయారు కావడానికి ఎవరు కారణం? ప్రభుత్వానికి కూలదోయాలని ఎవరు ప్రయత్నిస్తున్నారు చెప్పండి. ఒకే ఒక్కడు, తన స్వార్థం కోసం, తన అధికార దాహం కోసం ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకోవాలని ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని సజావుగా నడవనివ్వడం లేదు. అసలు ఆయనకు కాంగ్రెస్ ఏమి అన్యాయం చేసింది చెప్పండి? నిన్ను ఎంపీని చేసింది, కేంద్రంలో ఇంకా మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పింది. మీ తండ్రి రాజశేఖరరెడ్డి మరణించారు, పరిస్థితి అస్తవ్యస్థంగా ఉంది, కాస్త ఓపిక పట్టండి అని అధిష్ఠానం చెప్పినా నువ్వు వినలేదు.

మీ తండ్రి ఎవరినైతే దేవతగా కొలుస్తూ, అమ్మా, అమ్మా అని సంబోధిస్తుంటారో అలాంటి వ్యక్తిని నీవు తూలనాడావు, నీకు ముఖ్యమంత్రి అవకాశం పోయిందని వేరే పార్టీ పెట్టి రాష్ట్రంలో అస్తవ్యస్థ పరిస్థితికి కారణమయ్యావు'' అంటూ జగన్‌పై ధ్వజమెత్తారు. అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఆ పదవిని ఒక కవచంలా వాడుకోవాలనే ఆలోచనేనా మీ పార్టీ అజెండా అని నిలదీశారు.

"నీ తండ్రిని ఒక ఫ్యాక్షన్ లీడరుగా చూపిస్తూ పుస్తకాలు ముద్రించి ఢిల్లీలో పంచిన చంద్రబాబుతో చేతులు కలిపి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశావంటే నీది ఏ తరహా రాజకీయమో ప్రజలు గమనిస్తున్నారు. నీ పాపం పండే రోజు దగ్గర్లోనే ఉందని తెలుస్తోంది'' అని చిరంజీవి జగన్‌ను ఘాటుగా హెచ్చరించారు.

Advertise | About this site | Site Map | Privacy Policy | Disclaimer