చిరంజీవి సోమవారం
ఢిల్లీ
వెళ్లనున్నారు.
ఆయన ఉదయమే ఢిల్లీ
బయలుదేరి
వెళ్లనున్నారు.
అక్కడ ఆయన పలువురు
ముఖ్యనేతలను కలిసే
అవకాశముంది. ఈ
నెల 24వ తేదిన
ఆయన రాజ్యసభ
సభ్యుడిగా ప్రమాణ
స్వీకారం
చేయనున్నారు.
పార్టీ పెద్దలు
చిరంజీవితో ఆయనకు
ఇవ్వవలసిన పదవిపై
చర్చించే
అవకాశముందని
తెలుస్తోంది.
ఈ నెల 24న
పార్లమెంటు
సమావేశాలు
ప్రారంభం కానున్న
విషయం తెలిసిందే.
అదే రోజు ఆయన
ఎంపీగా ప్రమాణ
స్వీకారం చేస్తారు.
గత సంవత్సరం
డిసెంబర్ నెలలో
కిరణ్ కుమార్
రెడ్డి
ప్రభుత్వంపై
తెలుగుదేశం పార్టీ
కిరణ్ కుమార్
రెడ్డి
ప్రభుత్వంపై
అవిశ్వాస తీర్మానం
పెట్టినప్పుడు
చిరు ఆదుకున్నారు.
ఆ తర్వాత ఆయన తన
ప్రజారాజ్యం
పార్టీని
కాంగ్రెసులో
విలీనం చేశారు.
ఈ నేపథ్యంలో
చిరంజీవికి
కేంద్రమంత్రి పదవి
ఇస్తామని
అధిష్టానం హామీ
ఇచ్చినట్లుగా
వార్తలు వచ్చాయి.
దీంతో ఎంపీగా
ప్రమాణ స్వీకారం
చేయనున్న చిరుకు
ఏ పదవి ఇవ్వాలో
చర్చించేందుకే
ఆయన ఢిల్లీ
వెళుతున్నారని
అంటున్నారు.