CHERRY

Cherry

Galleries

Downloads

Others

        

CHIRU

Chiru

Biography

Filmography

Galleries

CCT

Downloads

Others 

                          

PAWAN

Pawan

Biography

Filmography

Galleries

Interviews

Downloads

Others

                             

BUNNY

Bunny

Biography

Galleries

Downloads

Filmography

                         

UPDATES

 

 Home| Galleries| PRP Galleries| PRP News| Video| Audio | Fan-zone | Records | Articles | News |Photo

Home   >   Updates  > News   > Chiranjeevi said he will file a defamation suit on Sakshi TV

కుమార్తె నివాసంలో ఐటీ సోదాలతో నాకు సంబంధం లేదు...
                                                          ఉద్దేశ్యపూర్వకంగా అసత్య ప్రచారం: చిరంజీవి

హైదరాబాద్, మే 12: కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు. తన పెద్ద కుమార్తె సుస్మిత నివాసంలో జరుగుతున్న ఐటీ సోదాలపై అసత్య ప్రచారం చేస్తున్న ఒక మీడియా ఛానెల్ తీరును తప్పుపట్టారు. ఈ ఐటీ సోదాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నైతిక బాధ్యత విస్మరించి, ఇష్టానుసారం వార్తను వక్రీకరించి వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తున్న సదరు ఛానెల్ (ఏబీఎన్ కాదు) నైతికతను చిరంజీవి ప్రశ్నించారు.

ఉప ఎన్నికల నిమిత్తం తన పెద్ద కుమార్తె సుస్మిత నివాసంలో పెద్ద ఎత్తున డబ్బు దాచానని, ఈ సమాచారం అందుకున్న ఐటీ శాఖ అధికారులు చెన్నైలోని వారి నివాసంపై దాడులు నిర్వహించారని ఒక ఛానెల్ అబద్ధపు ప్రచారం చేసినట్లు చిరంజీవి చెప్పారు. దీనితో తాను హుటాహుటీన ఢిల్లీ బయలుదేరి ఈ విషయమై ప్రణబ్ ముఖర్జీని సంప్రదించినట్లు సైతం సదరు ఛానెల్ ప్రచారం చేసిందన్నారు. తాను ఇక్కడే మీ ఎదుటే (విలేకర్ల సమావేశంలో) ఉన్నాను చూసుకోండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెన్నైలోని తన కుమార్తె అత్తవారింటిలో ఐటీ సోదాలు జరుగుతున్న మాట వాస్తవమే అయినా, వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. సదరు ఛానెల్ పనిగట్టుకుని లేనిపోని అబద్ధాలు ప్రచారం చేసి తనను అపవాదు పాలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఏమీ జరగకపోయినా, అంతా జరిగిపోయినట్లు, తాము కళ్ళతో చూసినట్లు చెప్పడం ఎంత వరకూ న్యాయమని ప్రశ్నించారు. ఆ ఛానెల్ యజమానికి ధైర్యం లేదు కాబట్టే తన అక్రమాస్తులపై అన్ని ఆరోపణలు వస్తున్నా మీడియా ముఖంగా కనీసం ఖండించలేకపోయారని అన్నారు. తనకున్న బలం నిజాయితీనేనని, ప్రజల అభిమానం తనవేపు ఉందన్నారు. 

Advertise | About this site | Site Map | Privacy Policy | Disclaimer